- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే గ్రూప్ వన్ టాపర్ వివరాలు బయటపెట్టాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
దిశ, చైతన్య పురి : రాష్ట్ర ప్రభుత్వం దమ్ముంటే గ్రూప్ వన్ పరీక్ష టాపర్ వివరాలు, మార్కులు, అతని పేరు బయటపెట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంగళవారం చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ లో నిరుద్యోగులకు భరోసా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ లీకేజీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైందన్నారు. పేపర్ లీకేజీ దొంగల చేతిలో ప్రభుత్వం ఉంటే మనకు న్యాయం జరగదన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త సభ్యులతో పోటీపరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వెనకనుండి నడిపిస్తున్నది మంత్రి కేటీఆర్ అని విమర్శించారు. పేపర్ లీకేజీ అనేది ఒక కుట్రగా పేర్కొన్నారు. లీకేజీ ప్రతి విషయం చైర్మన్ జనార్దన్ రెడ్డికి తెలుసన్నారు. సమస్యను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని కోరారు. మన అందరం ఒక్కటై ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పేపర్ లీకేజీ అంశాన్ని ప్రతి యూనివర్సిటీ, ప్రతి కోచింగ్ సెంటర్లను తిరిగి నిరుద్యోగులకు వివరిస్తానని అన్నారు.