- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
GHMC : రోడ్లపై చెత్త వేస్తే రూ.2000 ఫైన్ : జీహెచ్ఎంసీ

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది చెత్తను ఇంటి ముందు ఉన్న ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేస్తుంటారు. కొంతమంది నాలాల్లో వేస్తే ఎవరూ చూడరని అందులో వేస్తుంటారు. ఇక నుంచి అలా చేశారో మీకు భారీగా ఫైన్ వేయనున్నారు నగర పాలక అధికారులు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యతను పెంచేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వేసేవారి ఫోటోలు తీసి భారీ జరిమానాలు వేసేందుకు సిద్దమయింది. జరిమానాల విధానం పారదర్శకంగా అమలయ్యేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. తయారీ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని, అధికారులకు శిక్షణ, యాప్ తయారీ నెలరోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. అనంతరం దానిని ఉపయోగించే విధానంపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన జరిమానాల విధింపును సహాయ వైద్యాధికారులు, నిర్మాణ వ్యర్థాలపై ఉండే జరిమానాలను టౌన్ ప్లానింగ్ అధికారులు విధించనున్నారు. అందుకోసం 19 రకాల ఉల్లంఘనలను తెలుపుతూ వాటి జరిమానా విలువను అధికారులు లెక్క తేల్చారు. సర్కిళ్ల వారీగా అధికారులకు లాగిన్‌లు ఉంటాయి. జరిమానా విధించేటప్పుడు ఉల్లంఘన ఫొటో తీయాలి. అధికారి పేరు, జరిమానా మొత్తం, ఉల్లంఘనుల పేరు, ఫోన్ నెంబరు, చిరునామాతో డిజిటల్ రసీదు వస్తుంది.
జరిమానాలు ఇలా..
*రోడ్డుపై చెత్త వేయడం, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే రూ.100
*గోడలపై రాతలు, కాలువల్లో చెత్త వేస్తే రూ.1000
*దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే రూ.1000-రూ.2,000
*ఎవరైనా అనుమతి తీసుకోకుండా గోడలపై పోస్టర్లు వేస్తే రూ.2వేలు
*అనుమతిలేని బ్యానర్లు, కటౌట్లపై రూ.5వేలు
*బస్తీలు, కాలనీరోడ్లపై, ఖాళీస్థలాల్లో నిర్మాణ వ్యర్థాల డంపింగ్, తరలింపు రూ.5వేలు
*చెరువులు, రోడ్లు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే రూ.5వేలు
*బహిరంగంగా ప్లాస్టిక్‌ను కాలిస్తే రూ.5వేలు
*నాలాల్లో చెత్త వేస్తే రూ.10వేలు
*ప్లాస్టిక్ కవర్లు, సంచుల నిల్వ లేదా విక్రయం చేస్తే మొదటి తప్పుకు రూ.10వేలు, రెండో తప్పునకు రూ.25వేలు, మూడో తప్పునకు దుకాణం మొత్తం మూసివేస్తారు.
*నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని వాహనాలకు ఇచ్చే సంస్థకు: రూ.50వేలు