రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల తొలగింపు.. స్థానికుల ఆందోళన

by Shiva |   ( Updated:2024-10-08 15:37:24.0  )
రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల తొలగింపు.. స్థానికుల ఆందోళన
X

దిశ, కార్వాన్: రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమంగా వెలసిన షాపులను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు. మంగళవారం మల్లేపల్లి చౌరస్తా నుంచి షాపులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. అనంతరం ఒక్కొక్కటిగా భవనాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగానే భవనాలకు కూల్చివేస్తున్నట్లుగా ఏసీపీ కృష్ణమూర్తి వెల్లడించారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి మొత్తం ఆరు షాపులను కూల్చివేశామని పేర్కొన్నారు. కూల్చివేతల సమయంలో షాపు యజమానులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed