- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిటీకి ఐఎండీ రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే మహానగరంలోని ఐటీ సంస్థలు లాగిన్, లాగౌట్ సమయాలను, సర్కారు విద్యాసంస్థల వేళల్లో మార్పులు జరిగిన సంగతి తెల్సిందే. రెడ్ అలర్ట్ ఉన్న రెండు రోజుల పాటు అత్యవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి జనం బయటకు రావద్దని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడి అతి భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ కూడా ఇప్పటికే లోతట్టు, నాలా పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులకు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ వర్షం కురుస్తున్నపుడు ఎలాంటి సహాయం కోసమైనా జీహఎచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111ను సంప్రదించవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
ఈవీడీఎంకు వచ్చిన ఫిర్యాదులు..
సోమవారం ఉదయ 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈవీడీఎంకు మొత్తం 27 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ట్రీ ఫాల్ కు సంబంధించిన ఫిర్యాదులు 20 కాగా, వాటర్ స్టాగినేషన్ కు చెందినవి నాలుగు, గోడలు కూలినట్లు వచ్చిన ఫిర్యాదులు 2 కాగా, ఫైర్ కు సంబంధించిన ఫిర్యాదు ఒకటి ఉన్నట్లు, వీటిలో ఇప్పటి వరకు 22 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, మిగిలిన ఐదు ఫిర్యాదుల పరిష్కారం వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు జీహెచ్ఎంసీకి కూడా గడిచిన 24 గంటల్లో సుమారు 270 ఫిర్యాదులొచ్చినట్లు సమాచారం. వీటిలో సగానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించిన అధికారులు మిగిలిన ఫిర్యాదుల పరిష్కారం వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.