- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Munugodu by-poll మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటా: రాజగోపాల్ రెడ్డి ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ తనపై చేస్తున్న ఆరోపణలను ఆధారలతో సహా నిరూపించాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మరోట్వీట్ ద్వారా రాజగోపాల్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించిన మరికొన్ని వివరాలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో తన తప్పును కేటీఆర్ ఆధారాలతో నిరూపించాలని, తనకు రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు అక్రమంగా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా, మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయనని, నామినేషన్ దాఖలు చేయకుండా చివరి తేదీ వరకు తాను ఆగుతానని, బీజేపీ టెండర్ల ద్వారా తన కంపెనీలకు లబ్ధి చేకురినట్లు నిరుపిస్తే ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకపోతే, కేటీఆర్ తన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కు తాను కట్టుబడి ఉన్నానని.. కేటీఆర్ కట్టుబడి ఉంటాడా...? అంటూ ప్రశ్నించారు. తమ సంస్ధ 1986లో స్థాపించబడిందని, దేశ వ్యాప్తంగా టెండర్లు వేసి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానీ, కేటీఆర్ మాత్రం తమకు వచ్చిన టెండర్లను జార్ఖండ్, అరుణాచల్, అస్సాం రాష్ట్రంలో పనిచేస్తున్న కంపెనీలకు బీజేపీ నేతలు లబ్ధి చేకురేవిధంగా వర్క్ ఇచ్చారని, అంటే కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టులను(అరేంజ్ టెండర్లు) ఇస్తున్న విధంగా బీజేపీ ఇచ్చిందని ఆరోపించినట్లు తెలిపారు.
- Tags
- Munugodu by-poll