- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
దిశ, ముషీరాబాద్: పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ మల్టిపుల్ ప్రశ్నలకు ఏడు మార్కులను కలపడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, నిరుద్యోగుల పోరాటం న్యాయమైనదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తెలుగు అకాడమీ పుస్తకాలను తప్పు పట్టే స్థాయికి పోలీస్ రిక్రూమెంట్ బోర్డు దిగజారిందన్నారు. 15 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాల కారణంగా అభ్యర్థుల పోరాట ఫలితంగా హైకోర్టు మల్టిపుల్ క్యూస్షన్స్ లలో పోలీస్ రిక్రూమెంట్ బోర్డ్ ఏడు ప్రశ్నలను తప్పుగా ఇచ్చిందని నిరుద్యోగుల పోరాటం న్యాయమైందని వెంటనే ఏడు మార్కులకి కలపడం పై హర్షం వ్యక్తం చేశారు. తద్వారా 70 వేల నుంచి లక్ష వరకు తదుపరి దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం మాని హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తప్పుడు సమాధానాలు మల్టిపుల్ ప్రశ్నలతో అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకునేవిధంగా చేసిందని అన్నారు. ఇంత చేసినా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాము ఏ తప్పు చేయలేదని అడ్వకేట్ ల ద్వారా దుబాయింపులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం నాయకులు యాసం ప్రదీప్, కళ్యాణ్, సాయి, రాజు మల్లేష్, ప్రదీప్, సునీత, రోజా, చందన, దివ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ దీపిక బిల్లా, సుచిత్ కుమార్, నిఖిల్, సాయికుమార్, రాజ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచాలను కాల్చారు.