హైడ్రా ఉన్నా డోంట్ కేర్.. రూ.100 కోట్ల చెరువు కబ్జాకు రంగం సిద్ధం!

by karthikeya |
హైడ్రా ఉన్నా డోంట్ కేర్.. రూ.100 కోట్ల చెరువు కబ్జాకు రంగం సిద్ధం!
X

దిశ, కుత్బుల్లాపూర్: నగరంలో హైడ్రా కూల్చివేతతో కబ్జారాయుళ్లు హడలెత్తుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలను పూడ్చి ఏ మాత్రం భయం లేకుండా కబ్జాలు చేస్తూ సొమ్ము చేసుకున్న కబ్జాదారులకు హైడ్రా చర్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెరు వులు, గుట్టలను మింగిన కబ్జా రాబందులు ఏ రాత్రి మేము కబ్జా చేసిన ఇళ్లను కూల్చుతారో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని తెలియని అయోమయంలో వారి వెన్నులో వణుకు పుడుతుంది. కానీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లో కొందరు రాబందులు, కబ్జా డాన్లకు హైడ్రా అంటే ఏమాత్రం భయం, బెరుకు లేకుండా పోవ డం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఇక పోతే గాజులరామారం సర్వే నెం. 335లో మద్దా లకుంట చెరువు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ రికార్డుల ప్రకారం ఎ: 11.73 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది.కానీ నేడు ఆ కంట కన్నీరు పెడుతూ మాయం కాబోతుంది.

సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే ఈ చెరువును రికార్డుల నుంచి మాయం చేసేందుకు కొందరు కబ్జాల్లో కాకలు తీరిన రా బంధులు ఖతం చేస్తున్నారు. ప్రైవేట్ స్థలం పేరు తో చెరువును చెరబట్టి బండరాళ్లతో, మట్టితో చెరు వును నింపుతూ ఎంచక్కా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెరువు కాపాడటానికి శ్రద్ధ చూపడం లేదు. కబ్జాదారులతో చేతు లు కలుపుతూ లోపాయికారి ఒప్పందాలతో చెరు వు కబ్జాలో వాటా దారులుగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ తహశీల్దార్ గా చేసిన ఓ అధికారి కబ్జా దారులతో చేతు లు కలుపుతూ భారీ భూ స్కాంకు తెరలేపడం అప్పట్లో దుమారం చెలరేగింది. ఆయన ఇచ్చిన సహకారంతో మద్దాల కుంట చెరువును మింగేం దుకు కబ్జా రాయుళ్లు ప్రైవేట్ ప్రాపర్టీ పేరుతో భారీ స్థాయిలో చెరువును పూడుస్తూ ప్రహరీలు ఏర్పాటు చేస్తూ వ్యవస్థలకు సవాల్ గా నిలుస్తున్నారు.

చెరువును కాపాడండి -ఆకుల సతీష్, బీజేపీ నాయకుడు

గాజులరామారం మద్దాల కుంట చెరువును కొందరు కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. పట్ట పగలే చెరువును పూడుస్తూ ప్రహరీ నిర్మిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. చెరువు కబ్జా చేస్తున్న కబ్జా డాన్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చెరువును పూర్వ వైభవంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.


Next Story