Hyderabad : డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు.. కీలక వ్యక్తులు అరెస్ట్

by M.Rajitha |
Hyderabad : డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు.. కీలక వ్యక్తులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో గురువారం డ్రగ్స్ పార్టీ(Drugs Party)పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందటంతో సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసుల సంయుక్త దాడులు జరిపారు. తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ప్రియాంకరెడ్డి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరికి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసులు వీరిని రిమాండ్ కు తరలించారు. అయితే ప్రియాంకరెడ్డి ఇదివరకే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా.. ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. వీరితో పాటు హష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed