- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: హైదరాబాద్ శివారులో భారీగా కల్తీ పాల తయారీ
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారులో మరోసారి పోలీసులు కల్తీ పాల గుట్టు రట్టు చేశారు. పాశమైలారం పారిశ్రామిక వాడలో మంగళవారం కల్తీ పాల కేంద్రాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక, వేల లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కల్తీ పాలు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీ పాలను తాగటంతో చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారు. జీర్ణకోశ వ్యాధులు, న్యూమోనియ వంటి రోగాల బారిన పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దాడులు జరిపారు.