జైలుకెళ్లొచ్చినా.. బుద్ధి మార‌లే

by Disha News Web Desk |
జైలుకెళ్లొచ్చినా.. బుద్ధి మార‌లే
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: జైలుకెళ్లొచినా.. బుద్ధి ర‌లేదు. తిరిగి దొంగ‌త‌నాల‌కు పాల్పడుతూ పోలీసుల‌కు చిక్కి మళ్లీ క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఈ మేరకు ఎల్బీన‌గ‌ర్ డీసీపీ స‌న్‌ప్రీత్‌సింగ్ గురువారం మిడీయా స‌మావేశంలో వివ‌రాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దాచేప‌ల్లికి చెందిన అంబ‌టి చ‌క్రవ‌తి(32) గ‌త కొంతకాలంగా దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని పీఅండ్‌టీ కాల‌నీలో ఉంటున్నాడు. స్వగ్రామంలో ఉన్నప్పుడు ప‌లు దొంగ‌త‌నాలు, ఇత‌ర ఆస్తుల కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాడు. ఇత‌డిపై పిడుగురాళ్ల, న‌ర్సారావుపేట‌, గుంటూరు, సూర్యాపేట జిల్లా నకిరేకల్, కోదాడ పోలీసుస్టేష‌న్లలో 20 కేసులు ఉన్నాయి. 2019 డిసెంబ‌ర్‌లో గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. 2021 మే నెల‌లో జైలు నుండి విడుద‌ల‌య్యాడు. త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చి స‌రూర్‌న‌గ‌ర్‌లోని పీఅండ్‌టీ కాల‌నీలో గ‌త 6 నెల‌లుగా నివాసం ఉంటున్నాడు. సులువుగా డ‌బ్బు సంపాదించ‌డానికి అల‌వాటుప‌డ్డ నిందితుడు ఈనెల 26న పీఅండ్‌టీ కాల‌నీ క్రాస్‌రోడ్డు వ‌ద్ద ఉన్న ఓ మీసేవా సెంట‌ర్ కిటికీ గ్రిల్స్ తొల‌గించి రూ.1.30 ల‌క్షలు చోరీ చేశాడు. గురువారం ఉద‌యం పోలీసులు త‌నిఖీ చేస్తుండ‌గా ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో అత‌డి వ‌ద్ద నుంచి రూ.1.11 ల‌క్షల‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement

Next Story

Most Viewed