పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, హిమాయత్ నగర్ : వక్ఫ్ బోర్డులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముఖ్తర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ సిద్ధిఖీతో కలిసి ఆయన మాట్లాడుతూ..20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేల వెంబడి 100 ఎకరాల వక్ఫ్ భూమిని శ్మశానవాటికలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ ప్రాంతాలు, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇళ్లు లేని పేద

ముస్లింలకు 100 చదరపు గజాల వక్ఫ్ భూమి కేటాయించాలని కోరారు. మొత్తం వక్ఫ్ భూమిని భూ కబ్జాదారులు, ఆక్రమణదారులు మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. మైనారిటీ శాఖలన్నీ నిపుణులైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ను అమలు చేసి వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు ఇవ్వాలన్నారు. అలాగే చాలా కాలంగా కబ్జాలో ఉన్న వక్ఫ్ ఆస్తులను భూ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూ.5 లక్షల కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఈ సమావేశంలో సానా ఉల్లాఖాన్, ఖైరోద్దీన్, ఎండీ.దస్తగిరి, సలీం పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed