- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ లో పెలికాన్ సిగ్నళ్ల ఏర్పాటు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సేఫ్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల రక్షణార్థం హైదరాబాద్ లోని ముప్పయి చోట్ల బుధవారం పెలికాన్సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్కమిషనర్సీ.వీ.ఆనంద్ముఖ్య అతిధిగా హాజరై ఈ సిగ్నళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారుల బృందాలతో కలిసి నగరంలోని ఏయే ప్రాంతాల్లో పాదచారులు రోడ్లు దాటటానికి ఇబ్బంది పడుతున్నారు? ఏయే రహదారులపై రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంశాలపై అధ్యయనం చేసిన తరువాతే ఈ సిగ్నళ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాదచారుల సౌకర్యార్థం గతంలో పలుచోట్ల ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు నిర్మించినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు పెద్దగా ఉపయోగించుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే పెలికాన్సిగ్నళ్లను వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. రోడ్డు దాటాలనుకున్నపుడు వాలంటీర్ పెలికాన్సిగ్నల్ను ఆన్చేస్తాడని చెబుతూ అప్పుడు పాదచారులు రోడ్డు దాటొచ్చన్నారు.
పెలికాన్ సిగ్నల్ వెలిగితే వాహనదారులు తమ తమ వాహనాలను ఖచ్చితంగా ఆపాలని చెప్పారు. అలా కాకుండా ముందుకు దూసుకు వస్తే సీసీ కెమెరాల్లో అంతా రికార్డవుతుందన్నారు. ఈ ఫుటేజీ ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విదేశాల్లో పెలికాన్సిగ్నళ్లు చాలా చోట్ల ఉంటాయని చెబుతూ అక్కడి వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటిస్తారని తెలిపారు. చాలా చోట్ల వాహనదారులు సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళుతుండటం సర్వసాధారణమైపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పెలికాన్సిగ్నళ్ల వద్ద వాలంటీర్లను కూడా నియమిస్తున్నట్టు చెప్పారు. సేఫ్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రానున్న పదిహేను రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. పెలికాన్సిగ్నళ్ల వద్ద ఉండే వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ట్రై కమిషనరేట్ల పరిధుల్లో మరిన్ని పెలికాన్సిగ్నళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలియచేశారు.
బాడీ కెమెరాలు..
క్షేత్రస్థాయిలో పని చేసే వందమంది ట్రాఫిక్పోలీసులకు పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్బాడీ కెమెరాలను అందచేశారు. దీనివల్ల వాహనదారులతో మాట్లాడుతున్నపుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? వారిపట్ల ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్న వివరాలు తెలుస్తాయన్నారు. బాడీ కెమెరాల ద్వారా రికార్డయ్యే ప్రతీ అంశం ట్రాఫిక్కంట్రోల్రూంలోని కంప్యూటర్లలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇది పోలీసుల్లో జవాబుదారీతనం, పారదర్శకతను తేటతెల్లం చేస్తుందన్నారు. అదే సమయంలో ట్రాఫిక్నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు కలిగిస్తుందని చెప్పారు.
వాటర్‌బాటిళ్లు.. గ్లూకోజ్ప్యాకెట్లు..
ఎండల్లో మలమల మాడిపోతూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్పోలీసులకు ఎట్టకేలకు వాటర్‌బాటిళ్లు, గ్లూకోజ్ప్యాకెట్లు, చలువ కళ్లద్దాలతోపాటు వచ్చేది వర్షాకాలం కావటంతో రెయిన్కోట్లు, రెయిన్బూట్ల కిట్లను కమిషనర్సీ.వీ.ఆనంద్ అందచేశారు. దాంతోపాటు ట్యాబ్లను కూడా పంపిణీ చేశారు. ట్యాబ్లను సిబ్బందికి ఇవ్వటం వల్ల 100 నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించే వీలు కలుగుతుందన్నారు. దాంతోపాటు అనుమానితులు, పాతనేరస్తుల వివరాలను అప్పటికప్పుడు ఈ ట్యాబ్ల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌అదనపు పోలీస్కమిషనర్జీ.సుధీర్‌బాబు, జీహెచ్ఎంసీ నోడల్ఆఫీసర్ప్రియాంక, జాయింట్సీపీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.