- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka : ఇందిరమ్మ రాజ్యానికి పాపన్న జీవితం ఆదర్శం
దిశ,రవీంద్రభారతి : రాజ్యాన్ని అధిష్టించాడు, పాలించాలి బడుగులకు అవకాశాలు ఇవ్వాలని చేసి చూపించిన సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఇందిరమ్మ రాజ్యానికి ఆదర్శం అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతి వేడుకలు రవీంద్రభారతి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాపన్న జయంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాం అని తెలిపారు.
విద్యా వ్యవస్థ ద్వారానే మార్పు సాధించవచ్చని 5000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నం అని ఆయన వివరించారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తాం అన్నారు. హక్కులు, కోర్టులు, చట్టాలు లేని సమయంలోనే సర్వాయి పాపన్న ఎన్నో విజయాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పాపన్న జీవిత చరిత్రను ప్రచారం చేయడానికి నిధుల కొరత లేదని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రణాళికలు రూపొందిస్తే వాటిని ఆమోదిస్తాం అని, నగరం నడిబొడ్డులో సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలని పెద్దలు కోరుతున్నారని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆ బాధ్యతను అప్పగిస్తున్నాం అని.. స్థలం గుర్తింపు, ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసి తీసుకు వస్తే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పాపన్న గౌడ్ ఆలోచనలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరారని డిప్యూటీ సీఎం తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద , బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ , హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ ,బీసీ ఉద్యమకారుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.