- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరు నెలలుగా నో సాలరీ.. ఆన్ పాసివ్ టెక్నాలజీ సంస్థ నిర్వాకం
దిశ, శేరిలింగంపల్లి: ఉద్యోగుతో గొడ్డు చాకిరీ చేయించుకున్న సంస్థ గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా ప్రశ్నించిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంది. నానా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హైటెక్ సిటీ రోడ్డులోని హుడా కాలనీలో ఆన్ పాసివ్ టెక్నాలజీస్ పేరును ఓ ఐటీ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే, ఆ సంస్థలో 500లకు పైగా ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. కాగా, వారికి గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. విషయంపై పలుమార్లు ఉద్యోగులు సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఏమాత్ర స్పందించడం లేదు. సమస్యను అంతర్గతంగా పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సంస్థ యాజమన్యా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంస్థలో పని చేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులను, వారి కుటుంబాలను యాజమాన్యం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందని వారు పేర్కొన్నారు. తమ జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ పాసివ్ టెక్నాలజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా సోమవారం బాధిత ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అంతకు ముందు ఆన్ పాసివ్ కంపెనీ యాజమాన్యంపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.