- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Metro Rail: టీ-సవారీ యాప్‌లో తెలుగు ఉండాల్సిందే.. వివిధ రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో సేవలు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో ట్రైన్ యాప్ టీ-సవారీ గురించి అందరికీ తెలిసిందే. మెట్రో మ్యాప్, సమయాలు, టికెట్ బుకింగ్, ఇతర మెట్రో అంశాలు పూర్తిగా టీ- పవారీ యాప్‌లో అనేకం ఉంటాయి. అయితే యాప్‌లో ఉండే భాష తెలుగులో అందుబాటులో లేదు. దీంతో తెలుగు వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు కూటమి అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా యాప్‌లో తెలుగు భాష ఎందుకు ఇవ్వడం లేదని హైదరాబాద్ మెట్రోకు ట్యాగ్ చేశారు.
‘హైదరాబాద్ మెట్రో రైల్ టీ-సవారీ యాప్‌ను నేను ఆరేళ్ళుగా వాడుతున్నాను.ఇందులో సమాచారం ఆంగ్లంలో తప్ప తెలుగులో ఉండటం లేదు. బెంగళూరు, చెన్నై, పూణే తదితర మెట్రో యాప్‌లలో ప్రయాణీకులకు వారి స్థానిక భాషల్లో సేవలను అందిస్తున్నప్పుడు మీరు తెలుగులో ఎందుకు ఇవ్వలేరు ? హైదరాబాద్ ఒక తెలుగు నగరం, తెలుగులో సమాచారం ఇవ్వడం తప్పనిసరి.’ అని పేర్కొన్నారు. యాప్‌లో తెలుగు భాషను తెలుగు భాషను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.