ముజీబ్ హుసేనీకి భారత్ కే అన్నోల్ అవార్డు ప్రదానం

by Sridhar Babu |   ( Updated:2023-08-16 14:57:32.0  )
ముజీబ్ హుసేనీకి భారత్ కే అన్నోల్ అవార్డు ప్రదానం
X

దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : ఢిల్లీకి చెందిన ది న్యూస్ యు లైక్ ఆంగ్ల మ్యాగ్జిన్ టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీకి భారత్ కే అన్నోల్ బిరుదును ప్రదానం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏకే ఖాన్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముజీబ్ హుసేనీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మ్యాగ్జిన్ నిర్వాహకులు ఆయనను ఈ బిరుదుకు ఎంపిక చేసింది. గత నెల 31వ తేదీన దేశ రాజధాని

న్యూ ఢిల్లీలో అవార్డుల ప్రదానం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడంతో ఏకే ఖాన్ చేతుల మీదుగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ ఈ అవార్డు తన మీద మరింత బాధ్యత పెంచిందన్నారు. రాబోయే రోజులలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. ది న్యూస్ యూ లైక్ ఆంగ్ల మ్యాగ్జిన్ తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘ నాయకులు, ప్రతినిధులు ఆయనను అభినందించారు.

Advertisement

Next Story