ముచ్చింతల్ ప్రజలు అదృష్టవంతులు: ఎంపీ రంజిత్ రెడ్డి

by Disha News Web Desk |
ముచ్చింతల్ ప్రజలు అదృష్టవంతులు: ఎంపీ రంజిత్  రెడ్డి
X

దిశ, శంషాబాద్: దేశానికి పర్యాటక కేంద్రంగా చిన్న జీయర్ స్వామి ఆశ్రమం అని చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో కలిసి చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆశ్రమంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేసే అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటు చేయడం, దేశంలోని అన్ని దేవాలయాలలో ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని దేశానికే ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ఈ ప్రాంతంలో ఉండటం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు నీరటీ రాజు ముదిరాజ్, దిద్యాల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్వీ మున్సిపల్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed