Supreme court: ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ రిలీఫ్.. కానీ మరో కండీషన్

by srinivas |
Supreme court: ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ రిలీఫ్.. కానీ మరో కండీషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవితకు మరో పది రోజులపాటు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఈడీ విచారణను తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత తరపున లాయర్ వాదనలు వినిపించారు. కవితకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించొద్దని సూచించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణకు ఎలా పిలుస్తారని కవిత లాయర్ ప్రశ్నించారు. ఇందుకు ఈడీ కూడా వాదనలు వినిపించింది. విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవితకు మరో 10 రోజుల సమయం ఇస్తామని ఈడీ పేర్కొంది. కానీ విచారణకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed