చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నయ్... కాల్స్ డీటెయిల్స్‌తో సహా డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

by S Gopi |
చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నయ్... కాల్స్ డీటెయిల్స్‌తో సహా డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను చంపుతానంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బుధవారం డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ తనకు ఏఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో ఆ లిస్ట్‌ను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. అందులో 8 ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, వాటికి సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. కాగా, తనను చంపుతామంటూ పాకిస్థానీ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ ద్వారా వార్నింగ్స్ వస్తున్నాయని సోమవారం ఎమ్మెల్యే రాజాసింగ్‌ ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి' అని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. ట్వీట్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను రాజాసింగ్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.

Next Story

Most Viewed