- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతబస్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది: తలసాని
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీ అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలోని దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితబంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేవిధంగా చూడాలని, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, ఇన్‌చార్జిలు జీవన్ సింగ్, నందు బిలాల్ తదితరులు పాల్గొన్నారు.