- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాధానం చెప్పండి... బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బహిరంగ లేఖలో 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు పర్చడానికి నిరంతరం పోరాటం సాగిస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం స్థానానికి పరిమితమైనా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిందని, వారిపక్షాన మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాహుల్ గాంధీపై ఆరోపణలు మానుకోవాలని గులాబీ నేతలకు సూచించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది విద్యార్థులు, యువకుల కుటుంబాలను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు విస్మరించారో ఇప్పుడైనా జవాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. 2014 జూన్ 14న సీఎం హోదాలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంలో 1200 బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారని, ఆ తర్వాత అనేక సార్లు మాట మార్చి అమరుల సంఖ్యను 585 కు కుదిస్తూ వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్లడించారని, మిగిలిన 615 మంది ఏమై పోయారో పదేళ్ల విధ్వంస పాలనలో ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా? అని మంత్రి నిలదీశారు.
ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, గృహ వసతి, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలిచ్చారని, చివరకు కొద్ది మందికి నగదు, ఉద్యోగాలు ఇచ్చినా మిగిలిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, బిడ్డలను, కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాల గురించి కారు పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామన్న పెద్దలు అసలా మాటే అననే లేదని నాలుక మడత పెట్టింది వాస్తవం కాదా? దళిత కుటుంబాలకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నీటి మూట అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించ పరుస్తున్న విషయం ప్రజలకు తెలియదనుకుంటున్నారా? పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నది ఎవరు? మాట తప్పింది ఎవరు? తెలంగాణాను ఇచ్చిన సోనియమ్మ, రాహుల్ గాంధీలు అకస్మాత్తుగా శత్రువులు ఎలా అయ్యారు ? రాజకీయంగా అదృశ్యమైపోతామన్న భయంతోనే కదా ఈ ప్రేలాపనలన్నీ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదు అని ఆశలు కల్పించి కల్పించకుండా మోసగించింది మీరు కాదా? అని నిలదీశారు.
గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకయైనా సమర్థించుకున్న చరిత్ర ఎవరిది? నోటిఫికేషన్ విడుదల చేసిన మూడేళ్లలో సరిగ్గా పరీక్షలు నిర్వహించలేని అసమర్థత ఎవరిది? న్యాయస్థానాల జోక్యంతో పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితికి మీరు బాధ్యలు కాదా ? నిరుద్యోగుల ఉసురు పోసుకుంది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? అన్నారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం నివాసాలు నిర్మించి ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి పదేళ్లలో మీరు కట్టింది ఎన్ని? పంపిణీ చేసింది ఎన్నో గుండెపై చేయివేసుకుని చెప్పగలరా? కేజీ టు పీజీ విద్య హామీ అసలు మీకు గుర్తుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లోని 16,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికి, మరి లక్ష ఎకరాలైనా సాగులోకి వచ్చిందా? మేడిగడ్డ నిర్మాణలోపాల గురించి, అంచనా వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్షా 40 వేల కోట్లకు పెంచడం పైన విచారణ జరుగుతోంది కాబట్టి వ్యాఖ్యానించదల్చుకోలేదు. కానీ ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. మేము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం... మా అధినేత రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు... రాష్ట్రానికి వచ్చి వెళ్లారు... మరి జనం మధ్యకు వెళ్లంది మీరా, మేమా? అధికారం కోల్పోయాక ఇంటికే పరిమితమై బయటకు రానిది మీ పార్టీ అధినేత కాదా? రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళ్లమై పోతామని భ్రమ పడుతున్నట్టున్నారు... ఆయన జాతీయ నేత. ఉప ప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతున్న రాజకీయ పక్షం నాయకులు మీరు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.