- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీగా విదేశీ మద్యం పట్టివేత
దిశ, పేట్ బషీరాబాద్: భారతీయ రైల్వే మార్గం ద్వారా అక్రమ విదేశీ మద్యం తరలిస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్న ముఠాతో పాటుగా భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుచిత్ర లో ఉన్న మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికాంత్ వివరాలు వెల్లడించారు.
ఈ నెల 3న మేడ్చల్ దేవర యమైజాల్‌లో ఉన్న జెన్వి కన్వెన్షన్ హాల్‌లో ఈవెంట్ నిర్వహించుకోవడం మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. కానీ ఈవెంట్ లో అక్రమంగా విదేశీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా 63 విదేశీ మద్యం పట్టుబడింది. దీనితో నిర్వకుడు కురుమిల్ల మహిపాల్ అదుపులోకి తీసుకుని విచారించగా అతని సమాచారం మేరకు సుచిత్ర రామరాజు నగర్ లో ఓ ఇంటిలో దాడి చేయగా అక్కడ మరో 96 విదేశీ మద్యం పట్టుబడింది. దీంతో ప్రధాన నిందితుడితో పాటుగా మరో నలుగురిని అరెస్ట్ చేయగా ఇంకో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ 12 లక్షల 57 వేల 940 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే దొరికిన మద్యం సీసాలు విదేశివి అయినప్పటికీ అందులో మద్యం నకిలీ అనే అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.
- Tags
- Foreign Liquor