- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News.... రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత?
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పార్టీ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి రేపో మాపో అధికారిక ప్రకటనను పార్టీ వెలువరించే అవకాశముంది. ఇప్పటికే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఇటీవల కూడా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మునుగోడు బైపోల్ కు ముందే సస్పెన్షన్ ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమం రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణమైంది. ఆయన చేసే కామెడీలో హిందు దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానిస్తారని రాజాసింగ్ ముందు నుంచే చెప్పారు. ఫారూఖీ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తే ఆందోళన చేస్తామని రాజాసింగ్ ముందుగానే హెచ్చరించారు. అయినా భారీ భద్రత నడుమ మునావర్ ఫారూఖీ షోను నిర్వహించారు. దీంతో రాజాసింగ్ ఆయనపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఆగస్టు 25న పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించారు. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి ఒక వర్గానికి చెందిన ఓట్లన్నీ కోల్పోతామేమోనన్న భయంతో పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని 10 రోజుల సమయం కూడా ఇచ్చింది. కానీ రాజాసింగ్ జైల్లో ఉండటంతో రిప్లై ఇవ్వలేకపోయారు. దీనిపై ఆయన సతీమణి కాస్త సమయం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు లేఖ రాసింది. కాగా ఇటీవల రాజాసింగ్ షోకాజ్ నోటీసుపై స్పందించారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని, హిందువులకు సేవ చేసే అవకాశాన్ని తిరిగి కల్పించాలని రిప్లై ఇచ్చారు. రాజాసింగ్ ఇచ్చిన వివరణపై జాతీయ నాయకత్వం సంతృప్తి చెందినట్లు విశ్వసనీయ సమాచారం.
మునుగోడు పోలింగ్ కంటే ముందే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఈ బైపోల్ లో పార్టీకి కలిసొచ్చే అవకాశముంది. గతంలో పలు బహిరంగ సభల్లో రాజాసింగ్ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనికి తోడు కట్టర్ హిందువులు కూడా పార్టీకి దూరమవుతున్నారనే నేపథ్యంలో పార్టీ అంతర్మథనంలో పడింది. దీనికి తోడు ఇటీవల ఫాంహౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీపై.. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తుడిపేయాలని చూస్తున్న బీజేపీకి రాజాసింగ్ అంశం సదవకాశంగా దొరికింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను వీలైనంత త్వరగా ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్ తో మాట్లాడుతున్నట్లు టాక్. పార్టీ తరుపున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు న్యాయ సాయం అందించారు. పార్టీ కూడా రాజాసింగ్ కు పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు అన్ని విధాలుగా అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో రాజాసింగ్ పై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తే మునుగోడులో బలం పెరిగి మరింత కలిసొస్తుందని కమలం పార్టీ భావిస్తోంది.