- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదు
దిశ, ముషీరాబాద్: మీడియా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీబీసీపై కేంద్రం నిర్వహిస్తున్న ఐటీ దాడులకు వ్యతిరేకంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద టీడబ్ల్యూజేఎఫ్, హెచ్ యూజ్, టీబీజేఏ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. బీబీసీలో మోడీపై డాక్యుమెంటరీ వచ్చిన తర్వాతే ఐటీ దాడులు నిర్వహించిందంటూ, అంతకుముందు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించాలంటూ హిందూ సేన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడమంటే అది కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడమేనన్నారు. హెచ్ యూజే అధ్యక్షులు బి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే మీడియా గొంతు నొక్కుతున్నదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ యూజే ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగమణి, హెచ్ యూజే కార్యదర్శి బి.జగదీశ్వర్, నాయకులు బి.దామోదర్, పద్మరాజు, రామకృష్ణ, క్రాంతి, ప్రశాంత్, లలిత, విజయా, రేణయ్య, సుభాష్, రవితేజ, సర్వేశ్వర్ రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.