కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : మాజీ ఎంపీ వి. హనుమంతరావు

by karthikeya |
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : మాజీ ఎంపీ వి. హనుమంతరావు
X

దిశ ఖైరతాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ‘యూనిటీ - కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ’ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, ఆయన జయంతి సందర్భంగా ఆయన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని అన్ని థియేటర్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒప్పిస్తానని అన్నారు.

ఇక ఇదే విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయని, ఒక స్వాతంత్ర ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, బహుజనుల రాజ్యాధికారం కోసం పనిచేసిన గొప్ప వీరుడిగా ఆయన ఘనత మరువలేనిదన్నారు. అలాంటి వీరుడిని భారతరత్నతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు బడుగు విజయ్ కుమార్, నిర్మాత చిరందాస్ ధనుంజయలను ముఖ్య అతిథులు సన్మానించారు.

వారితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పిసిసి ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్, బీసీ సమాజ్ వ్యవస్థాపకులు సంగెం సూర్యరావు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్లా శివశంకర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, కేఎల్‌బీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు జ్ఞానేశ్వర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యదర్శి జెల్లా నరేందర్, పద్మశాలి సంఘం నాయకులు మేడం బాబురావు, వేముల బాలరాజు, గంజి శ్రీనివాస్, చిప్ప వెంకటేశ్వర్లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed