HYD: తొలి పూజ చేయండి.. గవర్నర్‌కు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం

by srinivas |   ( Updated:2023-09-17 11:35:07.0  )
HYD: తొలి పూజ చేయండి.. గవర్నర్‌కు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సై‌తో చేయించాలని కమిటీ నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయాలని గవర్నర్‌కు కోరారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారు. ఖైరతాబాద్ గణేశ్‌కు తొలి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా ఖైరతాబాద్‌లో ‌ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది 63 అడుగల గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఉత్సవ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ జరగనుంది. దీంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభవుతాయి. 9 రోజలు పాటు గణనాథుడు పూజలందుకుంటారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.

Advertisement

Next Story