- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖాదీని ప్రోత్సహించాలి : మాజీ స్పీకర్ మధుసూదనాచారి
దిశ,బేగంపేట : ఖాదీని ప్రోత్సహించడమంటే మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవడమేనని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానంద తీర్ధలో ఈ నెల 31 వరకు కొనసాగే ఖాదీ గ్రామోద్యోగ్ వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ఖాదీ వస్త్రాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారుచేయడం గొప్ప కళగా అభివర్ణించారు.
చీరాంబరాలను అగ్గిపెట్టెల్లో ఎగుమతి చేసిన కళా నైపుణ్యం మన సొంతం అన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. మన బ్రాండ్లు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని, అందుకోసం మరింతగా కళానైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందేలా చూస్తానన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ ఖాదీగొప్పతనాన్నితెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, స్వామి రామానందతీర్ధ మెమోరియల్ కమిటీ ఫౌండర్ చైర్మన్ సీవీ ప్రభాకర్రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, శశిరంజన్, సంజీవరావు, సురభి రెనవబుల్, ఎనర్జీ డైరెక్టర్ శేఖర్ మారంరాజు పాల్గొన్నారు.