- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరప్షన్ కు కేరాఫ్ కేసీఆర్ ఫ్యామిలీ : మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
దిశ, వనస్థలిపురం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత, అల్లుడు హరీష్ రావు, కుమారుడు మంత్రి కేటీఆర్ కుంభకోణాలు చేసి కరప్షన్‌కు కేరాఫ్ గా నిలిచారని సినీ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం వనస్థలిపురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కూతురు కవిత, ఇరిగేషన్ స్కామ్ లో అల్లుడు హరీష్ రావు, మున్సిపల్ స్కామ్ లో కేటీఆర్ పీకల్లోతు కుంభకోణాల్లో కోరుకుపోయారని ఆమె ధ్వజమెత్తారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి జనం సొమ్ముతో విలాసాలకు అలవాటు పడి విచ్చలవిడి స్కాములు చేస్తున్నారని విమర్శించారు. ఒక మహిళ నుండి భర్తల ప్రాణాలు తీసే లిక్కర్ స్కాంలో దేశవ్యాప్తంగా విస్తరించాలని కవిత ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడ్డవారు చట్టాల నుంచి తప్పించుకోలేరని, అందులో మొదటి వికెట్ కవితదేనని పేర్కొన్నారు. కేసీఆర్ పరిపాలనతో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
లిక్కర్‌కు కవిత బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని, అందుకే ఆమె ఈడీ అంటే భయపడుతుందని ఆరోపించారు. పోడు భూములను లాక్కోవడం, కేసీఆర్ గిరిజన మహిళలను జైలుకు పంపించడం సహించరానిదని అన్నారు. అంగన్వాడి మహిళలకు జీతాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, ఎల్బీనగర్ బీజేపీ కార్పొరేటర్లు, మహిళా అధ్యక్షురాలు క్రిష్ణవేణి నాగినేని, గీతారెడ్డి, మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు.