బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరోసారి IT రైడ్స్ కలకలం..రూ.3 కోట్లు స్వాధీనం

by Satheesh |   ( Updated:2023-10-21 07:18:50.0  )
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరోసారి IT రైడ్స్ కలకలం..రూ.3 కోట్లు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం నగరంలోని 12 చోట్ల ఏఎమ్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లోను ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా మహేష్ రెడ్డి ఇంట్లో అధికారులు రూ.3 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏఎమ్‌ఆర్ కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లో ఇంకా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed