- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Crime News : సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబ్ మహిళ జర్నలిస్టులు అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టుల(Women Journalists Arrested)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం చేస్తు ట్రోలింగ్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుపై వీరిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... సీఎం రేవంత్ రెడ్డిని అభ్యంతకరంగా దూషిస్తూ, అవమానపరుస్తు మాట్లాడుతున్న వ్యక్తులను ఇంటర్వ్యూలను తీసుకుని, వాటిని ఉద్దేశ్య పూర్వకంగా పల్స్ టీవీ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారన్నారు. ఎక్స్ లో కూడా వీటిని పోస్టు చేసి సీఎం ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పల్స్ టీవీ(Puls TV) ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు సోషల్ మీడియా సెల్ ప్రతినిధి కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఎక్స్ లో నిప్పుకోడి(Nippikodi) ప్రోఫైల్ ద్వారా పోస్టు చేసి ముఖ్యమంత్రి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టి.. పల్స్ టీవీ ప్రతినిధులైన పి. రేవతి(P. Revathi), బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్(Tanvi Yadav) లను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ తెలిపారు. రేవతిపై బంజారాహిల్స్ , ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఇదివరకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. తన్వి యాదవ్ కూడా ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక విడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిందని పోలీసులు వివరించారు. ఈ ఇద్దరీ నుంచి రెండు లాప్టాప్ లు, రెండు హార్డ్ డిస్క్ లు, టీపీ లింక్ వైర్ లెస్ రూటర్, సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు, అభ్యంతకరమైన పోస్టులను, అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అదనపు సీపీ విశ్వప్రసాద్ హెచ్చరించారు.