- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ పై దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే చర్యలు : ఎమ్మెల్యే దానం
దిశ, హిమాయత్ నగర్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్ లతో కలిసి కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని దానం తెలిపారు. వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యే లకు నోటీసులు ఇచ్చారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజా ప్రభుత్వంలో ఆలస్యం అయిన లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని దానం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా సంక్షేమ పథకాలపై రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ పేట కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు భారతి నాయక్, షరీఫ్, ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్, బిపిన్, తదితరులు పాల్గొన్నారు.