నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే...కానీ…: ఏసీపీ

by Kalyani |
నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే...కానీ…: ఏసీపీ
X

దిశ, సిటీక్రైం : నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ను ....కానీ ఇప్పుడు ఆయన హీరోగా కాదు....నిందితుడిగా వస్తున్నాడు...ఇలా సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ నాంపల్లి కోర్టు వద్ద గుమిగూడిన జనం ముందు మాట్లాడారు. అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్టు చేసిన తర్వాత అతనిని గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత నాంపల్లి కోర్టు కు తీసుకువస్తున్నారని తెలుసుకుని నాంపల్లి కోర్టులోని స్టాఫ్ తో పాటు భారీగా న్యాయవాదులు, వివిధ కేసులలో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన నిందితులు, కోర్టులో ఉండే ఇతర పోలీసు సిబ్బంది కోర్టు అవరణతో పాటు కోర్టు హాల్ వద్ద గుమ్మిగూడారు. దీంతో అల్లు అర్జున్ ను కోర్టు లోపలికి తీసుకువెళ్ళేందుకు ఇబ్బందిగా ఏర్పడింది.

అల్లు అర్జున్ దగ్గరకు ఎవరూ రాకుండా, కోర్టు ప్రాంగణం నుంచి హాల్ వరకు తీసుకువెళ్లేందుకు సైఫాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రత్యేక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ అల్లు అర్జున్ ను తీసుకువెళ్ళే మార్గం వద్ద అధిక సంఖ్యలో జనాలు ఉండడంతో నేను కూడా అల్లు అర్జున్ ను ఫ్యాన్ ను కానీ ఇప్పుడు ఆయన హీరో కాడు, అక్యూజ్డ్ గా వస్తున్నాడు...కాబట్టి మాకు సహకరించండి అతనిని కోర్టులో ప్రవేశపెట్టాలి, రద్దీ ఏర్పడకుండా చూడండి అంటూ కోరిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వాఖ్యాలకు అక్కడ ఉన్న జనం పోలీసులు కూడా పుష్పా ఫ్యాన్సే అంటూ నవ్వుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed