Hyderabad Collector : విద్యా ప్రమాణాలు పెంచి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

by Aamani |
Hyderabad Collector :  విద్యా ప్రమాణాలు పెంచి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ కు సూచించారు. హైదరాబాద్ డీఈఓ కార్యాలయం లో సీఆర్పీఎస్, సూపరింటెండెంట్స్, సెక్టోరల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచే విధంగా సిఆర్పిఎఫ్ లక్ష్యాలను నిర్దేశించుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. గతంలో హైదరాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో హాజరు శాతం 50 శాతం కన్నా తక్కువగా ఉండేదని, హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం తో పాటు, హాజరు శాతం పెంచిన ప్రధానోపాధ్యాయులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం తో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం( ఎఫ్ ఆర్ ఎస్) లతో 67.65 శాతానికి పెరగడం ద్వారా జిల్లా ద్వితీయ స్థానం సాధించడం జరిగిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం జిల్లాకు రూ 24 కోట్లు కేటాయించగా పాఠశాలల్లో పనులు పూర్తయిన సంబంధించిన బిల్లులు రూ 12 కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉన్న దిగువ నుండి పదిమంది సీఆర్పీఎస్ లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, చాలా కాలంగా గైర్ హాజరవుతున్న సీఆర్పిఎస్ ల నుండి వివరణ తీసుకోవాలన్నారు.

సరైన వివరణ ఇవ్వని వారిని తొలగించాలని కలెక్టర్ డీఈఓ ను ఆదేశించారు. సీఆర్పిఎస్ ప్రతి నెల 25వ తేదీలోగా తమ యొక్క అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం షెడ్యూల్ ను అందజేయాలని, వారి పరిధిలో ఉన్న పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి పాఠశాలలలోని ఏజీఆర్ రిజిస్టర్ లో తమ సందర్శనకు సంబంధించిన రిమార్కులను అందులో నమోదు చేయాలన్నారు. జీరో హాజరు శాతం ఉన్న పాఠశాలల వివరాలు, ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు, షిఫ్ట్ స్కూల్ ల వివరాలు పంపాలని సూచించారు. వచ్చేవారం జిల్లాలో ఓరియంటేషన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఆర్. రోహిణి, అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారెడ్డి, పెట్రోల్ ఆఫీసర్ రజిత, అసిస్టెంట్ సెక్టర్ ఆఫీసర్ పృద్వి, సీఆర్పీఎస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed