- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం'
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నందా అన్నారు. భారత న్యాయ వ్యవస్థ పై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు న్యాయవాదులు సామాజిక కార్యకర్తలుగా పనిచేయాలని అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి చంద్రకుమార్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, 1979 నుంచి రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. నాటి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కోట్ల అరుణకుమారి, లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సౌత్ డైరెక్టర్ లయన్ ప్రేమ్ చంద్ జైన్, పండిట్ గంగారం మెమోరియల్, ఫౌండేషన్ చైర్మన్ భక్త రామ్, ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్ విభాగం జాయింట్ డైరెక్టర్ మహమ్మద్ అక్బర్ అలీ, మేజర్ డి జయసుధ, ఇత్తా ఉదయశ్రీ, డాక్టర్ రవి తేజ, రాజేంద్ర ముదిరాజ్, సోమనాథ్ ఆర్య, ప్రదీప్ జాదూ, ఢిల్లీ శివ కుమారులు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు న్యాయ విజ్ఞానవేత్తల పురస్కారాలను డీఎల్ పాండు, ఎస్ కృష్ణ శర్మ, కే శాంత కుమార్ గౌడ్, బి మోహన్, ఎం సురేష్ కుమార్, జి విజయ కుమారి లతో పాటు పలువురు హైకోర్టు, రంగారెడ్డి, హైదరాబాద్ న్యాయవాదులను జస్టిస్ నంద శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. విశిష్ట సేవా రత్న పురస్కారాలు 2022 అందుకున్న వారిలో ఏ సూర్య నాయక్, కెప్టెన్ డాక్టర్ జి విజయ్, డాక్టర్ ఎం శ్రద్ధానందం, కోర యాదగిరి, ధరావత్ మహేష్ నాయక్, మహమూద్ అబ్దుల్ కరీం లు ఉన్నారు.