Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పరిస్థితి ఇంత దారుణమా..!

by srinivas |   ( Updated:2023-06-24 16:06:34.0  )
Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పరిస్థితి ఇంత దారుణమా..!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై వర్షపు నీరు పారుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. నాలాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాపుల్లోకి నీళ్లు రావడంతో అటు ఆర్టీసీ ప్రయాణికులు సైతం అవస్థలు పడుతున్నారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులు సైతం ఇక్కట్లు పడుతున్నారు.

మరోవైపు హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు గమనిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిబ్బంది సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వర్షం నిలిచిపోయే వరకూ ఎవరు రోడ్లపైకి రావొద్దని పిలుపునిచ్చారు. కరెంట్ స్తంభాలను పట్టుకోవద్దని, ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న పిల్లలను బయటకు పంపొద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed