Breaking: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం

by srinivas |
Breaking: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) పలుచోట్ల భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా నగరంలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికొండ, మెహిదీపట్నం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, మూసాపేట్, సోమాజిగూడ, ట్యాంక్ బండ్, మాదాపూర్, బోరబండ, ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్, ఎల్బీనగర్‌లో వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం (Floods) అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic) అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed