శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

by Vinod kumar |   ( Updated:2023-03-29 17:21:51.0  )
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దుబాయ్ నుండి (EK-524) ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశానికి చెందిన నలుగురు మహిళ ప్రయాణికులపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. దీంతో వారి వద్ద 1 కోటీ 94 లక్షల విలువ జేసే 3 కిలోల 175 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని పేస్టు రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో శరీర భాగంలో దాచి పెట్టుకుని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story