- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎంసీ ప్రిన్సిపాల్‌కు గవర్నర్ లేఖ... ప్రీతి ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశం
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ) పీజీ విద్యార్థిని మృతిచెందాటానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ను ఆదేశించారు. ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు ప్రీతి ఆత్మహత్యకు అనస్థీషియా తీసుకోవడమే కారణమా? ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు? ఎవరి సూచన మేరకు ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.? అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు. అలాగే, ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని శుక్రవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.