Y. S. Sharmila అరెస్ట్ పై స్పందించిన గవర్నర్.. పోలీసుల వ్యవహార శైలిపై ఫైర్

by Javid Pasha |   ( Updated:2022-11-30 04:32:58.0  )
Y. S. Sharmila అరెస్ట్ పై స్పందించిన గవర్నర్.. పోలీసుల వ్యవహార శైలిపై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ పై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. షర్మిల అరెస్ట్ ను గవర్నర్ తీవ్రంగా తప్పుపట్టారు. షర్మిల ఆరోగ్య, భద్రత విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కారులోపల ఉన్న షర్మిలను టోయింగ్ మెషిన్ తో లాక్కెళ్లుతున్న దృశ్యాలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాగా.. సోమవారం వరంగల్ జిల్లాలో తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా వైఎస్ షర్మిల మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు ఆమెను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కారులోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. కానీ కారులోపల ఉన్న షర్మిలను టోయింగ్ మెషిన్ తో పోలీసులు లాక్కెళ్లి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. షర్మిలపై అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story