- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీ అధికారుల సమాచారం ఇవ్వండి : సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
దిశ, ఖైరతాబాద్ః సమాజంలో నిజాయితీగా పనిచేసిన, పనిచేస్తున్న అధికారుల సమాచారాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు అందించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రజలను కోరారు. అదివారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి మాట్లాడారు. సమాజంలో రోజురోజుకూ అవినీతి పెరిగిపోతున్నదని, దానిని నిర్మూలించే క్రమంలో నిజాయితీగా పనిచేసే వారిని గుర్తించి సత్కరిస్తూ నేటి తరానికి పరిచయం చేయబోతున్నామని తెలిపారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ దేశంలోనే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగానే నిజాయితీపరుల సంఖ్యను పెంచే కార్యక్రమం అన్నారు. అవినీతి రహిత సమాజం విడతల వారీగా నిజాయితీ అధికారులను, నాయకులను, సర్పంచులను సత్కరిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 1న నిజాయితీ అధికారుల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు కొమటి రమేశ్ బాబు, బత్తిని రాజేశ్, జి. హరిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.