- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసీ గడ్డి పేరిట లక్షలు ఖర్చు.. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నదిలోని గడ్డి తొలగిస్తున్నామని ప్రభుత్వం లక్షలు రూపాయిలు ఖర్చు పెట్టిందని, కానీ ఎలాంటి ఉపయోగం లేదని జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. చెరువులు కబ్జా చేయడంతో వరద నీరు రోడ్లపైకి వస్తుందన్నారు. మూసీ నదిపై కబ్జాలన్నీ బీఆర్ఎస్ నేతలవేనని ఆరోపించారు. గత వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.
ముంపు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. వరదల నుంచి కాపాడమని కోరుతుంటే.. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. గచ్చిబౌలి లాంటి ఏరియాలు కూడా నీట మునుగుతున్నాయంటే బీఆర్ఎస్ పాలనను అర్థంచేసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, వరదలపై దమ్ముంటే చర్చకు రావాలని రాజేశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.