- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి పేరుతో ఘరానా మోసం
దిశ,జూబ్లిహిల్స్ : ఓ మహిళా నిర్మాత పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వెంకటగిరిలో నివసించే పుల్లంశెట్టి నాగార్జునబాబు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భైరవపురం చిత్ర నిర్మాణ సమయంలో మహిళా నిర్మాత ఆశ మల్లికతో అతనికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నాగార్జునబాబును ఆమె తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించింది. అది కాస్త ఇరువురి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. తాను తల్లిని అవుతున్నానంటూ నాగార్జున బాబుకు చెప్పింది.
తన భర్తకు విడాకులు ఇచ్చేస్తానని, పెళ్లి చేసుకోవాలని అతడిని ఆమె కోరగా తనకు వివాహమైందని, భర్తకు విడాకులు ఇస్తానని చెప్పి చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద నాగార్జునబాబుని పెళ్లి చేసుకుంది. డబ్బు అవసరమంటూ అతని నుంచి రూ.18.50 లక్షలు తీసుకుంది. డబ్బులు అడిగితే బెదిరింపులకి దిగింది. నాగార్జున బాబు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఆశామల్లిక బ్లాక్మెయిల్ చేయడంతో అతడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మల్లిక వ్యవహారశైలిపై నాగార్జునబాబుకు అనుమానం వచ్చి ఆమె గురించి విచారించగా
ఆమెకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు, ముగ్గురు పిల్లలున్నట్లు తెలిసింది. ఆమెకు ఒకే వివాహమైందని, పిల్లలు లేరని అబద్దం చెప్పిందని పోలీసులకు చెప్పాడు. వారు విచారించగా 2016లో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో భరత్‌పై, 2019లోకూకట్పల్లి ఠాణాలో శ్రీనివాస్‌పై పెళ్లి చేసుకొని ఫిర్యాదులు చేసినట్లు తేలింది. నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడి ఆస్తిలో వాటా కొట్టేస్తున్నట్లు వెల్లడైంది. మల్లికపై నాగార్జునబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.