కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో చేర్చడం శుభపరిణామం: గజ్జెల నగేష్

by S Gopi |
కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో చేర్చడం శుభపరిణామం: గజ్జెల నగేష్
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కేంద్ర ప్రభుత్వం విలీన ప్రక్రియపై తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కృషి మేరకు అతి త్వరలోనే ఫలితం దక్కనుందని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం, విధి విధానాలు చేయడానికి ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. అతి తక్కువ సమయంలో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న అనేక సంక్షేమ పథకాలు పూర్తి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చైర్మన్ గజ్జెల నాగేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed