అయోధ్య రామ మందిర ఉద్యమంలో జి.పుల్లారెడ్డి సేవలు మరువలేనవి

by Sridhar Babu |   ( Updated:2024-01-22 11:33:18.0  )
అయోధ్య రామ మందిర ఉద్యమంలో జి.పుల్లారెడ్డి సేవలు మరువలేనవి
X

దిశ,జూబ్లిహిల్స్ : అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా జూబ్లిహిల్స్, షేక్ పేట్ జి.నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అయోధ్య రామ మందిర ఉద్యమంలో

దివంగత జి. పుల్లారెడ్డి ఎంతగానో సేవలు కొనియాడారు. పుల్లారెడ్డి దంపతులకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు భారత దేశ చరిత్రలో మరపురాని దినమని అన్నారు. జాతి గర్వించదగ్గ రీతిలో రామమందిర నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్పర్సన్ శ్రీవిద్యా రెడ్డి అయోధ్య రామాలయ నిర్మాణం తమ తాత జి. పుల్లా రెడ్డి కల అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా.రమేష్ రెడ్డి, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed