- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నిస్తే కేసులు పెడతారా..: రేవంత్ సర్కార్‌పై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాపర్యటనలోఅబద్దాలు చెప్పారని మండిపడ్డారు. ఐదు మెడికల్ కాలేజీలు కట్టడం నిర్లక్ష్యమా? పెండింగ్ ప్రాజెక్టులు అన్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా చేయడం నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ టౌన్‌లో తాగునీటి ఎద్దడి ఉండేదని, కేసీఆర్ ఇంటింటికి నల్లా నీరు ఇచ్చారన్నారు. 2014 కు ముందు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు అమర రాజా కంపెనీ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నారు. కొత్త కంపెనీలను పాలమూరు జిల్లాకు రేవంత్ రెడ్డి తీసుకురావాలన్నారు. మన్నెంకొండ దేవస్థానానికి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు అభివృద్ధిఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. మహబూబ్ నగర్ టౌన్‌లో అంధుల కాలనీలో 75 ఇళ్ళుకూలగొట్టారని, మేము అంధులను ఆదుకున్నందుకు మాతమ్ముడిని అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. తన తమ్ముడికి బెయిల్ రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.