న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

by Kalyani |
న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష
X

దిశ, ముషీరాబాద్: గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూసెన్స్ కు పాల్పడి, కాలనీ వాసులను దుర్బాషలాడిన కేసులో ఓ వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష పడింది. గాంధీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిసి నగర్ కు చెందిన అబ్దుల్ అక్బర్ బండ మైసమ్మ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాంప్లెక్స్ లో అకారణంగా కొందరిని దుర్బాషలాడటంతో పాటు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ కోర్టుకు తరలించగా అక్బర్ కు 5 రోజుల జైలు శిక్ష విధించారు.

Advertisement

Next Story