- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు చేప ప్రసాదానికి చేపలు రెడీ..
దిశ, కార్వాన్ : ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు చేపప్రసాదానికి చేపలను సిద్ధం చేసినట్లు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో 8, 9, 10 తేదీలలో మూడు రోజులపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు, అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సుశిక్షితులైన మహిళ మత్స్యకారులు, ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తల నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రతి జిల్లాల్లోనూ 20 నుండి 30 వరకు ఫిష్ ఫుడ్ స్టాల్స్, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ స్టాల్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా చేప ప్రసాదం పంపిణీ కోసం ఇప్పటికే చేపలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ చేప ప్రసాదానికి సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు చేరుకుంటున్న ప్రజలతోపాటు స్థానిక ప్రజలు కూడా నిర్వాహకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చేపల ప్రసాదం పంపిణీకి అవసరమైన నాణ్యమైన చేప పిల్లలను మత్స్య సహకార సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మత్స్యశాఖ అధికారులు సేకరించి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 300 మంది వాలంటీర్లను శిక్షణ ఇచ్చి సిద్ధం చేసినట్లు, 40 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మంత్రి తలసాని చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం తిరిగి ప్రారంభించుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ చేప ప్రసాదంలో ప్రశాంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరారు. రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ మత్స్యకారులకు ఎంతో ప్రాధాన్యమైనదని తెలిపారు. చెరువుల పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.