Fire Accident : పాతబస్తీలో ఘోర అగ్నిప్రమాదం

by M.Rajitha |   ( Updated:2025-03-07 16:16:37.0  )
Fire Accident : పాతబస్తీలో ఘోర అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని పాతబస్తీ(Old City)లో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. మదీనా సర్కిల్ లో గల ఝాన్సీ బజార్ లోని ఓ హోల్ సెల్ క్లాత్ షోరూంలో మంటలు అంటుకోగా.. క్రమంగా అవి ఆ భవనం మొత్తం వ్యాపించాయి. ఐదు అంతస్తుల్లో గల బిల్డింగ్ పూర్తిగా మంటల్లో చిక్కుకోగా.. భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. అయితే ఆ భవనంలో మొత్తం బట్టల దుకాణాలు ఉండటంతో నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నా... ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాగా భవనంలోని షాపుల యజమానులు, వర్కర్స్ ప్రాణభయంతో పరుగులు తీయగా.. మరికొంతమంది బిల్డింగ్ పై అంతస్థులో చిక్కుకున్నట్టు సమాచారం. వీరిని అగ్నిమాపక దళాలు సురక్షితంగా కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉన్నతాధికారులు ప్రమాదస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed