Lal Darwaza Bonalu : ప్రారంభమైన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు

by Aamani |
Lal Darwaza Bonalu :  ప్రారంభమైన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు
X

దిశ,చార్మినార్​ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా శుక్రవారం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహీని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్​షాహీ శ్రీ జగదాంబ దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోట మైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్​ శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజారోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు.

లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్​ కె.శ్రీనివాస్​ రెడ్డి​..

ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్​ కె.శ్రీనివాస్​ రెడ్డి, సౌత్​ జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా, జీహెచ్ఎంసీ చార్మినార్​ జోనల్​ కమిషనర్​ వెంకన్నలతో కలిసి 116 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్​ సి. రాజేందర్​ యాదవ్​​ ఆధ్వర్యంలో గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం తో పాటు శిఖర పూజ, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో ​అమ్మవారికి మహాభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున మాజీ చైర్మన్​ మాణిక్​ప్రభు గౌడ్​ కుటుంబం తొలి బోనం సమర్పించింది. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్​ సి.రాజేందర్​ యాదవ్​​ కుటుంబ సమేతంగా కలశస్థాపన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ డీసీపీ షేక్​ జహంగీర్​, ఆలయ కమిటీ ప్రతినిధులు మారుతి యాదవ్​, సతీష్​ ముదిరాజ్​,చంద్రకుమార్​,మాణిక్​ ప్రభు గౌడ్​, కె.వెంకటేష్​, జయలక్ష్మీ నారాయణ గౌడ్​, విష్ణు గౌడ్​, సీరా రాజ్​కుమార్​, సి.రాజ్​కుమార్​ యాదవ్, శేష్​ నారాయణ, ఎ.వినోద్​ కుమార్​, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ​

Advertisement

Next Story

Most Viewed