నగరంలో ఐటీ అధికారుల విస్తృత సోదాలు

by Aamani |
నగరంలో ఐటీ అధికారుల విస్తృత సోదాలు
X

దిశ, శేరిలింగంపల్లి : గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో మరోసారి దాడులు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈరోజు ఉదయం కూకట్ పల్లి రెయిన్ బో విస్టా, మాదాపూర్, బషీర్ బాగ్ లోని ఓ ఫైనాన్స్ కంపెనీ తో పాటు పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ యజమాని, ఓ న్యూస్ ఛానల్ ఎండీ ఇంట్లో తెల్లవారు జాము నుంచే ఈ సోదాలు సాగుతున్నాయి. బషీర్ బాగ్ లోని పైగా ప్లాజా లోని 2, 3, 4 అంతస్తులో ఐటీ అధికారులు లోపలికి మీడియాని అనుమతించకుండా భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed